భర్త పెట్టే బాధలు భరించలేక... జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకబోయిన మహిళను ఓ పోలీసు కాపాడి తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని నందనవనం బస్తీకి చెందిన ముగ్గురు పిల్లలు గల రాజేశ్వరి తన భర్త పెట్టే బాధలు భరించలేక మీర్పేట్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది.
అటు వైపు నుంచి వెళ్తున్న మీర్పేట్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ యాదగిరి గమనించి ఆమె దగ్గరికి వెళ్లాడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తన భర్త రోజూ తాగి వచ్చి తనను, తన పిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది. అందుకే చనిపోదామనుకున్నానని తెలిపింది. సమస్యలు సద్దుమనుగుతాయని కానిస్టేబుల్ నచ్చ చెప్పి ఆమెను పోలీసు స్టేషన్కు తరలించారు. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ని పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: ఇంట్లో మందలించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!