ETV Bharat / jagte-raho

ఇరు వర్గాల మధ్య ఘర్షణ - బొప్పారంలో కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు వార్తలు

మంచిర్యాల జిల్లా బొప్పారంలో భూతగాదాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Conflict between the two factions in bopparam mancherial district
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Jun 4, 2020, 10:05 PM IST

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో భూ తగాదాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు తమ వ్యవసాయ భూముల్లో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఓ వ్యక్తి ట్రాక్టర్​తో మహిళపైకి దూసుకురావడంతో స్థానికులు ఆమెను పక్కకు తప్పించారు.

ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ఇరు వర్గాల మధ్య భూ తగాదాలు జరుగుతున్నాయి. భూ వ్యవహారం కోర్టులో ఉండటం వల్ల సమస్యను పరిష్కరించడానికి అధికారులూ ముందుకు రావడం లేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.