''ఒరేయ్ బావా.. చూడు బావా.. ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఈ ఇయర్ కి.''
''బావా.. రేపు ఏమైనా చనిపోతావా ఏంటి?''
''అలా అని కాదు బావా.. సెల్ఫీ బావా.. ఈ ఇయర్ కి లాస్ట్ ఇదే''.
ఇలా.. ఇద్దరు స్నేహితుల మధ్య టిక్ టాక్‌లో జరిగిన సరదా సంభాషణ చివరికి నిజమైంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తవలసకు చెందిన వినోద్.. తన స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి వరకూ సరదాగా గడిపాడు. కొత్త సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేశాడు. ఇదే తన చివరి సెల్ఫీ అంటూ వినోద్.. తన స్నేహితులతో అన్నాడు. ఇది చిత్రీకరించి టిక్ టాక్‌లో పోస్ట్ చేశాడు.
కాసేపటికే.. ముగ్గురూ కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. యడ్లపాలెం సమీపంలో రాత్రి వేళ తాటి చెట్టును ఢీ కొన్నారు. ఈ ఘటనలో.. వినోద్ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు.
ఇదీ చూడండి: డ్రగ్స్ మత్తులో కారుతో యువకుల హల్చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు