ఈజీమనీ లక్ష్యంగా ఎంచుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండు టాయ్ పిస్టల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖలోని విష్ణు కెమికల్స్ ఓనర్ రామక్రిష్టరాజును ఈ నెల 27న కొంపల్లిలో సినీఫక్కీలో కిడ్నాప్ చేసి రూ. 4 కోట్లు డిమాండ్ చేసి అనంతరం ఘట్కేసర్లో వదిలివెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నాచారంలోని విష్ణు కెమికల్స్ పక్కనే ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హరిప్రసాద్ అనే వ్యక్తి.. విష్ణు కెమికల్స్ ఓనర్ కంపెనీకి వచ్చి పోయే సమయాన్ని అనుకరించాడు.
విష్ణు కెమికల్స్ ఓనర్ కంపెనీకి వెళ్లే సమయంలో హరిప్రసాద్‌తో పాటు మరో ఐదుగురు కొంపల్లి బ్రిడ్జి వద్ద అతని కారును అడ్డగించారు. టాయ్ గన్స్ చూపించి అతన్ని కారులో ఎక్కించుకుని విషమని చెప్పి బీ- కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇచ్చారు. దానికి విరుగుడు తమ దగ్గర ఉందని.. అందుకోసం రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. తాను యజమానిని కాదని.. కంపెనీలో మేనేజర్‌ను అని చెప్పగా.. వారం రోజుల్లో డబ్బు సేకరించాలని.. లేని పక్షంలో చంపేస్తామని బెదిరించి ఘట్కేసర్లో వదిలేసి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులు, వారు ఉపయోగించిన రెండు టాయ్ గన్లు, ఓ మత్తు ఇంజక్షన్‌తో పాటు స్విఫ్ట్ కారు, బైకును సీజ్ చేసి వారికి రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.