ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్​ చోరీ.. దొంగల ముఠా అరెస్ట్​ - యాదాద్రి భువనగిరిలో డీజిల్​ దొంగలు అరెస్ట్​

జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్​ దొంగిలిస్తున్న ముఠాను చౌటుప్పల్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి లారీ, రూ.1.25లక్షల నగదు, 50 లీటర్ల డీజిల్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆగిఉన్న వాహనాల నుంచి డీజిల్​ కొట్టేస్తున్న ముఠా అరెస్ట్​

author img

By

Published : Nov 6, 2020, 5:05 PM IST

హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై ఆగిఉన్న వాహనాల నుంచి డీజిల్​ దొంగిలిస్తున్న ముఠాను చౌటుప్పల్​ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్​కు చెందిన భగత్​సింగ్​, హైదరాబాద్​కు చెందిన మహ్మద్​ తాహిర్​ను విచారించగా ముఠా గుట్టురట్టయింది.

ఎలా చిక్కారంటే...

పంతంగి టోల్​గేట్ వద్ద ఆగి ఉన్న లారీ నుంచి ఇద్దరు వ్యక్తులు డీజిల్​ తీస్తున్నారు. అక్కడ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానమొచ్చి విచారించగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్​కు చెందిన ఆరుగురు, హైదరాబాద్​ వాసి ముఠాగా ఏర్పడి డీజిల్​ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించారు. ఓలారీని అద్దెకు తీసుకుని... ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్​ తీసి హైదరాబాద్​లో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి లారీ, రూ.1.25నగదు, 50లీటర్ల డీజిల్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరినీ రిమాండ్​కు తరలించారు. ముఠాను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: యాప్​లో క్రికెట్ బెట్టింగ్​.. అప్పుల పాలవుతున్న యూత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.