హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తవుతున్నా... కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ బాధితులు నిరసనకు దిగారు. కంపెనీకి చెందిన ఒక డైరెక్టర్ వెంకటరమణారావు సోమవారం వరకు అందుబాటులో ఉన్నా... పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అతను కూడా పారారయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెక్నాలజీని ఉపయోగించి గంటల వ్యవధిలోనే కేసులు ఛేదిస్తోన్న పోలీసులు... తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఖాతాదారుల డబ్బులతో చిట్‌ఫండ్ కంపెనీ డైరెక్టర్లు ఆస్తులను కొనుగోలు చేసి తమను నిండా ముంచారన్నారు. వారి ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.