హైదరాబాద్ మంగళహాట్ ఆర్య సమాజ్ వద్ద పతంగుల దుకాణంపై ఎస్ఐ జగన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి నిషేధిత 59 చైనా మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పతంగుల దుకాణం యజమాని రాకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చైనా మాంజా వల్ల పక్షులకు ప్రమాదమని.. ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజలెవరూ వీటిని కొనకూడదని సీఐ రణవీర్రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం