ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామకు.. ఛత్తీస్ గఢ్ నుంచి ఓ యువకుడు ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఓ బోర్ వెల్ కంపెనీలో పని చేసేందుకు.. ఆదివారం రాత్రి నందిగామ చేరుకున్నాడు. ఒక్క రోజు గడిచిందో లేదే.. మృత్యువాత పడ్డాడు. అంబులెన్స్ రూపంలో తరుముకు వచ్చిన మృత్యువు.. అతడి ప్రాణం తీసింది. నందిగామలో రోడ్డు దాటుతున్న ఆ యువకుడిని.. విజయవాడ వైపు వెళ్తున్న 108 వాహనం ఢీ కొట్టగా.. గాల్లో పల్టీలు కొడుతూ రహదారిపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఆసుపత్రికి తరలించినా.. ఆగిపోయిన శ్వాస
తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా నల్సార్ గ్రామానికి చెందిన కడెం సుద్రూ (31) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : ఏపీలో పొలిటికల్ హీట్... సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు, తోపులాట