సికింద్రాబాద్‌లోని పీజీ రోడ్ సింధి కాలనీలో కమతం యామిని, సంజయ్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారు స్థానిక ఆర్యవన్ అపార్ట్మెంట్ నాల్గో అంతస్తులో కిండర్ గ్రాఫ్ టెక్నాలజీస్ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు యామిని డైరెక్టర్‌గా, సంజయ్ కుమార్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి డిపాజిట్ పేరుతో డబ్బులు వసూలు చేశారు.
అనంతరం కొద్ది రోజులు శిక్షణ పేరుతో తరగతులు నిర్వహించారు. శిక్షణ సమయంలో చెల్లిస్తామన్న స్టైఫండ్ చెల్లించలేదు. డబ్బులు తిరిగి చెల్లించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేయడం వల్ల 2019 డిసెంబర్ నుంచి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. 14 మంది బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యామిని, సంజయ్‌ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
ఇదీ చూడండి: సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు