మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్లోని "భాను టాయిస్ వరల్డ్" షాపులో యజమానురాలు ఉర్మిళాదేవి కౌంటర్ మీద తన పని తాను చేసుకుంటుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి ఉర్మిళా దేవి కళ్లలో కారం కొట్టాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లడానికి ప్రయత్నించగా.. ఆమె తేరుకొని తన వద్ద ఉన్న చెత్తబుట్టతో చైన్ స్నాచర్పై తిరగపడింది.

దీంతో ఆమెను వదిలేసి దొంగ పారిపోతుండగా.. స్దానికులు వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి పేరు సాధక్గా గుర్తించారు.
ఇదీ చదవండి: సిలిండర్ల దొంగ దొరికాడు