ETV Bharat / jagte-raho

సెల్​ఫోన్ల భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్​ - medak district latest crime news

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుమారు రూ.3 కోట్ల విలువైన సెల్​ఫోన్ల భారీ చోరీ కేసును మెదక్ పోలీసులు ఛేదించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని 20 రోజుల్లోనే దొంగల జాడ పట్టుకున్నారు. చోరీకి గురైన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

cell phones theft accused arrested by chegunta police
సెల్​ఫోన్ల భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్​
author img

By

Published : Oct 5, 2020, 7:30 AM IST

మెదక్​ జిల్లా మాసాయిపేటలో గత నెల 16న జరిగిన సెల్​ఫోన్ల భారీ చోరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని.. సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అసలేమైందంటే..

గత నెల 15న చెన్నై నుంచి దిల్లీకి రూ.11 కోట్ల విలువైన చరవాణులను తీసుకొని ఓ కంటైనర్‌ లారీ బయలుదేరింది. 16వ తేదీన మార్గమధ్యలో సెల్​ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చేరుకున్న తర్వాత విషయాన్ని గుర్తించిన డ్రైవర్​.. రూ.2.85 కోట్ల విలువ చేసే 2200 ఫోన్లు అపహరణకు గురైనట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారమిచ్చాడు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గల ఓ దాబా వద్ద భోజనం కోసం కంటైనర్​ను 45 నిమిషాలు నిలిపారు. ఈ నేపథ్యంలో అక్కడే చోరీ జరిగిందనే అనుమానంతో చేగుంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

సీసీటీటీ ఫుటేజీల సాయంతో..

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. చరవాణులతో కంటైనర్​ బయలుదేరిన చెన్నై నుంచి మొదలుకొని దొంగతనం జరిగిందని భావించిన మాసాయిపేట వరకు అన్ని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు. చిత్తురు జిల్లా శ్రీసిటీ నుంచి ఓ లారీ, కారు కంటైనర్​ను వెంబడించినట్టు గుర్తించారు. వీటి ద్వారానే చోరీకి పాల్పడ్డారన్న అనుమానంతో.. ఆ వాహనాలు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయో వివరాలు సేకరించారు. ఈ కారు, లారీ మాసాయిపేట నుంచి మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ వైపు వెళ్లినట్లు ఆ మార్గంలోని టోల్​గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ సాయంతో గుర్తించారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన కంజర్‌భట్‌ అనే నరహంతక ముఠానే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.

ఆ విషయంలో సిద్ధహస్తులు..

కంజర్‌భట్‌ ముఠా కదులుతోన్న వాహనాల్లో నుంచి చోరీ చేయడంలో సిద్ధహస్తులు. మాసాయిపేట వద్ద తాళం తీసిన ముఠా.. కంటైనర్‌ కదులుతుండగానే కారు, లారీలో ప్రయాణిస్తూ సెల్‌ఫోన్లను కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాలు ముఠా ఉండే ధానఘేట్​ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో భద్రపరిచిన రూ.2.35 కోట్ల విలువ చేసే 1,826 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఏపీ: సెల్​ఫోన్​ కంటైనర్​ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.