ETV Bharat / jagte-raho

బ్యాంకు నిధులు కాజేసిన కేసులో ఆంధ్రా బ్యాంకు మేనేజరుకు జైలు శిక్ష

మెదక్‌ జిల్లా ఆంధ్రా బ్యాంకు భానూర్‌ బ్రాంచ్ మాజీ మేనేజరుకి సీబీఐ కోర్టు శిక్ష విధించింది. బ్యాంకు నిధులు కాజేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మేనేజరు డి.నరసింహారెడ్డికి మూడేళ్ల పాటు జైలు శిక్ష, రూ. లక్షన్నర జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

cbi verdicts imprisonment to andhrabank ex manager medak district
బ్యాంకు నిధులు కాజేసిన కేసులో ఆంధ్రా బ్యాంకు మేనేజరుకు జైలు శిక్ష
author img

By

Published : Oct 15, 2020, 4:43 PM IST

అక్రమాలకు పాల్పడి బ్యాంకు నిధులు కాజేసిన అభియోగాలపై ఆంధ్రా బ్యాంకు మాజీ మేనేజరు డి. నరసింహారెడ్డికి సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మెదక్ జిల్లా భానూర్ బ్రాంచ్ మేనేజరుగా పనిచేసే సమయంలో రూ. 7 కోట్ల 46 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు నరసింహారెడ్డిపై సీబీఐ గతంలో అభియోగ పత్రం దాఖలు చేసింది. పలువురు ఖాతాదారులకు చెందిన సేవింగ్, కరెంట్ ఖాతాల నుంచి ఇతరులకు డబ్బులు మళ్లించడంతో పాటు డీడీలను పక్కదారి పట్టించినట్లు సీబీఐ పేర్కొంది.

విచారణ జరిపిన సీబీఐ అదనపు కోర్టు.. నరసింహారెడ్డిని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష, రూ. లక్షన్నర జరిమానా విధించింది.

ఇదీ చదవండి: విషాదం: తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.