ETV Bharat / jagte-raho

2020 రౌండప్ ​: రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..! - Hyderabad Accidents in 2020

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో పోలీస్​ విభాగం ఈ ఏడాది కాలంలో ప్రభావంతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది నేరాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గగా.. ఆర్థిక, సైబర్​ నేరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. జంటనగరాల పరిధిలో సంచలనం సృష్టించిన కేసులను కూడా పోలీసులు చాకచాక్యంగా ఛేదించారు. సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ.. త్వరతగతిన దోషులకు శిక్ష పడేలా చేశారు. కొవిడ్ కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ముందుండి చేసిన సామాజిక సేవ, నగరాన్ని ముంచెత్తిన వరదల్లో బాధితులకు అండగా నిలిచిన వైనం సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.

capital crimes
2020 రౌండప్​: రాజధానిలో ఈ ఏడాది సంచలనం సృష్టించిన కేసులివే..
author img

By

Published : Dec 30, 2020, 12:23 PM IST

జంటనగరాల్లో ఈ ఏడాది చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కలకలం సృష్టించాయి. ఆయా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివాహేతర సంబంధాల కేసులు, పరువు హత్య, ఘోర రోడ్డు ప్రమాదాలు, నేపాల్​, ఏటీఎం చోరీ కేసులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టించాయి. ప్రధానంగా సైబర్​ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ... నేరగాళ్ల ఉచ్చులో కొందరు చిక్కుకొని జేబులు గుల్ల చేసుకున్నారు. లోన్​ యాప్స్​ మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు లోన్​ యాప్​ నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టులు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

కుటుంబం చిన్నాభిన్నం

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కల్యాణ్‌... భార్య ఆరేళ్ల కుమార్తె ఆద్యతో కలిసి రాంపల్లిలో నివసించే వాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన కరుణాకర్‌ అనే వ్యక్తితో కల్యాణ్​ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరో వ్యక్తితో కూడా చనువుగా ఉండడంతో... విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన కరుణాకర్‌ చిన్నారి ఆద్యను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. కుమార్తె హత్య, భార్య వివాహేతర సంబంధం భర్త కల్యాణ్‌ భరించలేక... రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

పరువు హత్య

చందానగర్‌లో పరువు హత్య పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్‌, అవంతిక గచ్చిబౌలిలో నివాసముంటున్నారు. హేమంత్‌తో వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ కలిసి సుపారి హత్యకు పథకం వేశారు. ఈ నేపథ్యంలో హేమంత్‌ను అపహరించి సంగారెడ్డి శివన్నగూడెం వద్ద దారుణంగా అంతమొందించారు. ఈ కేసులో పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు.

బుల్లినటి ఆత్మహత్య కేసు

ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరిగింది. వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించిన పోలీసులు ప్రియుడు దేవరాజ్​తో పాటు శ్రావణి కుటుంబానికి సన్నిహితుడైన సాయి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అమ్మని, చెల్లిని చంపేశాడు

మేడ్చల్ మండలం రావల్​కోల్​కు చెందిన సాయినాథ్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్​కు అలవాటు పడి డబ్బు కోసం తల్లిని, చెల్లిని కడతేర్చాడు. తండ్రి మరణించగా వచ్చిన సొమ్ముతో పాటు... వ్యవసాయ పొలం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బు 20లక్షల కలిపి బ్యాంకులో జమ చేశారు. సాయినాథ్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్​లో దాదాపు 12 లక్షల దాకా ఖర్చు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి, చెల్లి మందలించడంతో వాళ్లను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆహారంలో పురుగుల మందు కలిపి వాళ్లకు ఇచ్చాడు. అది తిన్న తల్లిచెల్లి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందారు.

నేపాల్ ముఠా దొంగతనాలు

నమ్మకంగా పనిచేసి అదును చూసి వరుస చోరీలతో నేపాల్‌ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అక్టోబరు నెల 5న రాయదుర్గం ఠాణా పరిధిలోని బీఎన్​రెడ్డి హిల్స్​లో మధుసూధన్ అనే వ్యాపారి ఇంట్లో పని చేసే నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్న వారికి ఆహారంలో మత్తుమందు కలిపి 23లక్షల నగదు, 5తులాల బంగారం ఎత్తుకెళ్లారు. నాచారంలో కూడా ఇలాంటి చోరీనే జరిగింది. ప్రదీప్ కుమార్ నేపాల్​కు చెందిన వాళ్లను పనిలో పెట్టుకున్నాడు. ప్రదీప్ బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న వృధ్దురాలికి మత్తు మందు ఇచ్చి ఇంట్లోని 18తులాల బంగారు ఆభరణాలు, పది లక్షల నగదు, 40తులాల వెండి కాజేసి ఉడాయించారు. ఫిబ్రవరి నెలలో నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల ఇంట్లో పని చేసిన నేపాల్ వ్యక్తులు అదును చూసి వారిని తాళ్లతో కట్టేసి దోచకుని వెళ్లారు. మూడు నెలల క్రితం సైనిక్​పురిలోని నర్సింహ్మారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో యజమానులు శుభకార్యానికి వెళ్లగా ఇల్లు గుల్ల చేసి 2కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు. ఆయా కేసుల్లో నేపాలీ ముఠాలను కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ తరహా కేసులతో ఇళ్ల యజమానులు అప్రమత్తమయ్యారు.

ఏటీఎం చోరీలు

నగర శివారు ప్రాంతాలు, రహదారి పక్కనే ఉండే ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా గ్యాస్‌ కట్టర్లతో వాటిని ధ్వంసం చేసి దోపిడీలకు పాల్పడడం పోలీసులను కలవరపెట్టాయి. చందానగర్‌, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు ఏటీఎంలను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకుపోయారు. ఈ కేసులో పలు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు.

తహసీల్దార్ నాగరాజు కేసు

కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాదాస్పద భూమి విషయంలో స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించేందుకు నాగరాజు భారీగా లంచం తీసుకున్నాడు. ఈ స్థాయిలో లంచం తీసుకుంటూ దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు పట్టుబడలేదని అనిశా అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నాగరాజుపై నమోదైంది. రిమాండ్​లో భాగంగా చంచల్​గూడ జైల్లో ఉన్న నాగరాజు అక్టోబర్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘోర రోడ్డు ప్రమాదాలు

ఇదిలా ఉంటే నగర శివార్లలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు కలవరపెట్టాయి. హైదరాబాద్ బీజాపూర్‌ రహదారిపై ఇన్నావో వాహనం బోర్‌వెల్‌ లారీ ఢీ కొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. డిసెంబరులో గచ్చిబౌలి విప్రో కూడలి వద్ద జరిగిన మరో ప్రమాదంలో కారు, టిప్పర్‌ వాహనం ఢీ కొనడంతో అయిదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు వద్ద బాహ్యవలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్​కు చెందిన ఆరుగురు కూలీలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఇన్​స్పెక్టర్​పై కిరోసిన్​తో దాడి

డిసెంబరు 24న మేడ్చెల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి మున్సిపల్‌ అధికారులతో కలిసి బందోబస్తు కోసం వెళ్లిన... జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బిక్షపతిరావుపై కబ్జాదారులు కిరోసిన్‌ సీసాలు విసిరారు. ఈ ఘటనలో బిక్షపతిరావు నలభై శాతం కాలిన గాయాలకు గురయ్యారు. ఈ కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

1500 కోట్ల రూపాయల మోసం

ఆన్​లైన్ జూదం ద్వారా చైనాకు చెందిన వ్యక్తులు దాదాపు 1500 కోట్ల రూపాయలను మోసం చేశారు. ఈ-కామర్స్ పేరుతో పలు వెబ్ సైట్లను ప్రారంభించిన చైనాకు చెందిన యాన్ హు.. దీనికోసం దిల్లీకి చెందిన ముగ్గురు యువకులను ఉపయోగించుకున్నాడు. వాళ్ల సాయంతో తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించాడు. వేల సంఖ్యలో ఆన్​లైన్ జూదం ఆడి జేబులు గుల్ల చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి చైనాకు చెందిన యాన్ హుతో పాటు దిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను.... గుజరాత్​కు చెందిన ఓ వ్యాపారిని అరెస్ట్ చేశారు. 1500 కోట్ల రూపాయలను మోసం చేసి క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ రూపంలో చైనాకు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

దా'రుణ' యాప్​లకు ప్రాణాలు బలి

ఏడాది చివరలో రుణయాప్​ల కేసులు కూడా సంచలనం సృష్టించాయి. హైదరాబాద్​లో ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​, మెదక్​లో ఓ యువకుడు, సిద్దిపేటలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని రుణయాప్​ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్బీఐ, ఎస్​బీఎఫ్​సీ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్న రుణయాప్​లపై సైబర్​ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపారు. రుణయాప్​ల వెనక కూడా చైనీయుల హస్తం ఉన్నట్లు సైబర్​ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 28 మందిని అరెస్ట్​ చేసి... రుణయాప్​ నిర్వాహకుల ఖాతాల్లో ఉన్న దాదాపు 90 కోట్లను సీజ్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

చేదోడు వాదోడుగా నిలిచిన పోలీసులు

కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. విధి నిర్వహణలో భాగంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 5 వేల మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడగా 40మందికి పైగా మృతి చెందారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలను బయటకు రానీయకుండా పోలీసులు సాహసోపేతంగా విధులు నిర్వహించారు. కరోనాబారిన పడిన వాళ్లకు ఆసుపత్రులకు తరలించేందుకు కరోనా నియంత్రణ ప్రదేశాల నుంచి ప్రజలను బయటకు రానీయకుండా పోలీసులు జీహెచ్ఎంసీ, వైద్యఆరోగ్యశాఖ సాయంతో ముందుకు వెళ్లారు. ఉపాధి కోల్పోయిన వాళ్లకు సామాజిక సేవలో భాగంగా పోలీసులు నిత్యావసర సరకులు, ఆహారం అందించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను సొంత ప్రాంతాలకు పంపించడంలో పోలీసులు ఎంతో కీలక భూమిక పోషించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​

నగరంలో అక్టోబర్ మాసంలో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. వరద నీటిలో చిక్కుకున్న వందల మందిని పోలీసులు కాపాడారు. నిరాశ్రయులైన వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. రోజుల పాటు వరద నీటిలో ఇళ్లలో ఉన్న వాళ్లకు ఆహారం, మంచినీరు అందించారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ మృతదేహాన్ని అబ్దుల్లాపూర్ మెట్ కానిస్టేబుల్ వెలికితీయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారి ప్రశంసలందుకుంది.

కంట్రోల్​రూమ్​కు అనుసంధానం

సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీసులకు ఎంతో ఉపయోగపడనుంది. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్​కు అనుసంధానం చేశారు. భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఒకేసారి పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. రహదారులపై ట్రాఫిక్ జాం అయినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్​లోని సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండే వాళ్లను అప్రమత్తం చేయనున్నారు. అంతేకాకుండా ఏదైనా నేరానికి పాల్పడిన తర్వాత పారిపోయే నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులను కూడా సీసీ కెమెరాల ద్వారా గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 24 గంటల పాటు సీసీ కెమెరాలు పరిశీలించడానికి 3 షిప్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడానికి ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.

దేశంలోనే మొదటిస్థానం

ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పోలీసులు ఎన్నో క్లిష్టమైన కేసులను చేదించగలిగారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.3 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దేశంలో మొదటి స్థానం.... ప్రపంచంలో 16వ స్థానంలో నిలిచింది. నేరాలు తగ్గించేందుకు, రహదారి ప్రమాదాలు నివారించేందుకు వచ్చే ఏడాది కృషి చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.