సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో సస్పెన్షన్‌కు గురైన భూవివాదంలోనే మరోసారి తలదూర్చారంటూ ఓ మహిళా ఇన్స్పెక్టర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల శంషాబాద్ జోన్ పరిధిలోని ఓ ఠాణా ఎస్‌హెచ్‌వోగా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా బాధ్యతలు స్వీకరించిన 11 నెలల్లోనే బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆమెను కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేశారు.
మాదాపూర్ భూమిపై కన్ను..
మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్లో సుమారు 500 గజాల ప్లాటును పీఎం అబ్రహం 1982లో కొనుక్కున్నాడు . 2001లో వరంగల్ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన హరిప్రసాద్‌కు ఆ స్థలాన్ని విక్రయించాడు. అప్పటి నుంచి ఆ స్థలం ఆయన అధీనంలోనే ఉంది. ఈ స్థలం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీన్ని చేజిక్కించుకునేందుకు సదరు మహిళాఅధికారి గతంలో రంగంలోకి దిగింది. అప్పటికి ఆమె మాదాపూర్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నారు. భర్త కూడా పోలీస్‌శాఖలోనే విధులు నిర్వర్తిస్తుండగా.. అధికారాన్ని ఉపయోగించుకుని ఇద్దరు కలిసి కబ్జా చేసేందుకు యత్నించారు. విషయం ఉన్నతాధికారులకు చేరగా.. ఆమెపై కేసు నమోదు చేసుకుని సస్పెండ్ చేశారు.
నకిలీ పత్రాలతో మోసం..
నకిలీ పత్రాలు సృష్టించి ఆ ప్లాట్ తనదేనంటూ మరోసారి తెరపైకొచ్చారు. అక్కడి నుంచి ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ యజమాని మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నెల 3న మహిళా ఇన్స్పెక్టర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండిః 'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చేశారు'