సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 16 మందిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసులు నమోదు చేసింది. మరో గుర్తు తెలియని వ్యక్తిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఫేస్బుక్, ట్విటర్ తదితర మాధ్యమాల్లో న్యాయమూర్తులకు విరుద్ధంగా పోస్టులు పెట్టినట్టుగా సీబీఐ గుర్తించింది. ఇప్పటికే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన కేసులను యథాతథంగా తీసుకుంటున్నట్టుగా సీబీఐ పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 154, 153 ఏ, 504, 505 ల ప్రకారం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లను కలుపుతూ ఒకే కేసుగా దర్యాప్తు చేయనున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది.