రాచకొండ కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లిలోని ఎల్లారెడ్డి ఫామ్‌హౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పదిమందిని అదుపులోకి తీసుకొగా... మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరి వద్ద నుంచి 57, 120 రూపాయాల నగదు, పది మొబైల్ ఫోన్లు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు, 16 పేకాట సెట్స్ స్వాదీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కీసర పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదీ చడండి: ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు