ETV Bharat / jagte-raho

బిల్లు కట్టమని వెయిటర్లకు మీ ఏటీఎం కార్డు ఇస్తున్నారా..?

రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల్లు, మరే ఇతర ప్రాంతాల్లో అయినా బిల్లు కట్టమని వెయిటర్లకు మీ ఏటీఎం కార్డును ఇస్తున్నారా? అయితే మీ ఖాతా ఖాళీ అయినట్టే. వెయిటర్లుగా చేరి కార్డులు క్లోనింగ్ చేస్తూ.. రూ.లక్షలు కాజేశారు ఒడిశాకు చెందిన ముగ్గురు సభ్యులు. ఇప్పటివరకూ 150 మంది కస్టమర్ల నుంచి వారి కార్డుల వివరాలు సేకరించారని తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు.

card
మీ ఏటీఎం కార్డును ఇస్తున్నారా?
author img

By

Published : Mar 18, 2020, 5:23 AM IST

Updated : Mar 18, 2020, 7:32 AM IST

బిల్లు కట్టమని వెయిటర్లకు మీ ఏటీఎం కార్డు ఇస్తున్నారా..?

ఒడిశాకి చెందిన ప్రఫుల్ కుమార్ అతని స్నేహితులు హేమంత్ కుమార్, సుజిత్ కుమార్​లు పదేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో.. తమ సహచరులు గతంలో కార్డు క్లోనింగ్ చేస్తున్న విధానాన్ని గమనించి, వీరు కూడా అదే బాట పట్టారు. ప్రధాన నిందితుడైన ప్రఫుల్ కుమార్ నగరంలోని పలు పబ్బులు, రెస్టారెంట్లలో పనికి చేరి అతని స్నేహితులను కూడా అక్కడ చేర్పించాడు. అయితే ముందుగానే వీరు ఆన్​లైన్​లో కార్డు స్కిమ్మర్, క్లోనింగ్ మిషన్​ను కొనుగోలు చేశారు.

పిన్ నంబర్​ గుర్తుపెట్టుకుంటారు..

కస్టమర్లు బిల్లు కట్టే సమయంలో కొంత మంది వారి పిన్ నంబర్​ను వెయిటర్​కి చెప్తారు. ఇదే అదునుగా చూసి వారి చేతిలో ఉన్న స్కిమ్మర్ సాయంతో డేటాను స్వైప్ చేస్తారు. అనంతరం కస్టమర్ కార్డును పీఓఎస్ మెషీన్​లో పెట్టి సాధారణంగా బిల్లును కడతారు. అదే సమయంలో వారు నమోదు చేసే పిన్ నంబర్​ను గుర్తుపెట్టుకుంటారు.

బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో..

ఇలా పలు కార్డులు వివరాలు స్కిమ్మర్​లో తస్కరించి వాటిని లాప్​టాప్​కు అనుసంధానం చేస్తారు. ఈ వివరాలతో క్లోనింగ్ పరికరంలో నకిలీ కార్డులు సృష్టిస్తారు. తాజాగా గచ్చిబౌలికి చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ తమ ఖాతాదారుల నుంచి డబ్బు చోరీ జరిగిందంటూ చేసిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఇలా ఇప్పటి వరకూ 150 మంది కస్టమర్ల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించినట్లు పోలీసులు వివరించారు.

రూ.13 లక్షలు డ్రా..

తయారు చేసిన నకిలీ కార్డులను జూబ్లీహిల్స్, యూసఫ్​గూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల వద్ద తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో విత్​డ్రా చేస్తారు. ఇప్పటి వరకూ రూ.13లక్షల నగదును ఏటీఎంల నుంచి తీసుకున్నట్లుగా విచారణ తేలింది.

మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎంల ద్వారా..

ప్రస్తుతం దాదాపు అన్ని ఏటీఎంలు చిప్ రీడింగ్ ద్వారా డబ్బులు ఇస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎంలు ఉన్నాయి. వీటి ద్వారానే వీరు నగదు డ్రా చేస్తారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10.1 లక్షల నగదు, స్కిమ్మర్, క్లోనింగ్ మెషీన్, 44 నకిలీ డెబిట్, క్రెడిట్ కార్డులు, 6 చరవాణుల స్వాధీనం చేసుకున్నారు.

రెస్టారెంట్లు, బార్లు పలు ప్రదేశాల్లో బిల్లులు కట్టేటప్పుడు పిన్ వివరాలు గానీ, కార్డులు గానీ ఎవరికి ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా పిన్ నంబర్లను, ఆన్​లైన్ బ్యాంకింగ్ రహస్య కోడ్​ని తరచూ మారుస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: రైతు రుణమాఫీకి గ్రీన్​ సిగ్నల్​.. మార్గదర్శకాలు విడుదల

Last Updated : Mar 18, 2020, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.