యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిజా కారు బ్రేక్లు ఫెయిల్ అయి.. 4 వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం తరిలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.
కారు ఢీకొనడం వల్ల ఒక స్కూటీ పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే స్కూటీ దగ్ధమైంది. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా మాన్యగూడెంకు చెందినట్లుగా గుర్తించారు.
ఇదీ చదవండి: బైక్, ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు