నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం-హైద్రాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించింది. ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవులోనిబావి గ్రామ సమీపంలో రెండు కార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి.
ఆ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ కొత్తకొటకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని పోలీసులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వారిని హైదరాబాద్కు తరలించారు.
ఇదీ చూడండి : గ్రీన్ ఛానల్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత