తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. లారీని వెనుకవైపు నుంచి బస్సు ఢీకొట్టిన ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం వద్ద చోటు చేసుకుంది. ఎడమపక్కన తగలడంతో అద్దాలు పగిలి బస్సు లోపల పడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఘటన జరిగిందిలా..
ఖమ్మం నుంచి భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తోంది. వైరా దాటిన తర్వాత రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. బస్సు ఎదురుగా వెళ్తున్న లారీ ట్యాంకర్ డ్రైవర్ రెడ్డిగూడెం వద్ద పెద్ద గుంతను చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనక ఉన్న బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేక లారీని ఢీకొట్టాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.