సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట శ్మశానవాటిక వద్ద ఆటోడ్రైవర్ శ్రీకాంత్‌రెడ్డి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నెలరోజుల క్రితం హత్య చేసినట్లు పూడ్చిపెట్టినట్లు అల్వాల్ ఎస్సై గంగాధర్ వెల్లడించారు. వారం కిందట శ్రీకాంత్‌రెడ్డి కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన బిల్డర్ కనకరాజుకు దమ్మాయిగూడ వద్ద తాపీ పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు రాగా...ఆమె ఆటోడ్రైవరైనా శ్రీకాంత్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగింది. ఇలా వారిద్దరినీ చూసి తట్టుకోలేక బిల్డర్ కనకరాజు, అతని అనుచరులు ఒకే గదిలో బంధించి తీవ్రంగా కొట్టి శ్రీకాంత్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గత రాత్రి బిల్డర్ ఇంటికి చేరుకుని అతన్ని ఆదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని వెలికతీసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.