నాగర్కర్నూల్ జిల్లాలో భార్యను కిరాతకంగా హతమార్చాడో భర్త. బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య... భార్య లక్ష్మిని రోకలిబండ, కర్రతో బాది కడతేర్చాడు. భార్యాభర్తలు నిత్యం గొడవ పడే వారని స్థానికులు తెలిపారు. రాత్రి కూడా ఇరువురు గొడవపడినట్లు పేర్కొన్నారు.
క్షణికావేశంలో లక్ష్మయ్య... భార్యను ఇంట్లో ఉన్న రోకలిబండ, కర్రతో కొట్టి చంపేశాడు. గొడవకు ప్రధాన కారణం లక్ష్మయ్య... మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. లక్ష్మయ్య... భార్యను హతమారుస్తున్న సమయంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూడా అక్కడే ఉండి సహకరించినట్లు మృతురాలి కూతుళ్లు వాపోయారు.
హత్యకు గురైన లక్ష్మికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లిని చంపి తండ్రి జైలు పాలవ్వగా... మరోవైపు తల్లి హత్యకు గురి కావడం వల్ల పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.