ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లిలో చోటుచేసుకుంది. చౌటకుంటతండాకు చెందిన బానోతు సుగుణ, కుమారస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.
చిన్న కొడుకు గౌరవెల్లి ప్రాజెక్టు క్యాంపు వద్ద స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. నీటిలోకి దిగిన కొద్దిసేపటికి మునిగి చనిపోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.
ఇదివరకు పెద్దకుమారుడు ఇదే చోట ఈతకు వెళ్లి మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో భర్త కూడా మరణించగా... ఇపుడు మరో కుమారుడు ఇలా చనిపోయాడని సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: వీఆర్వోను అన్నమాట వాస్తవమే... అలా ఎందుకన్నానంటే: ఎమ్మెల్యే వివేకానంద