భద్రాచలంలో ఓ మైనర్ బాలికపై మెకానిక్ దుకాణంలో పనిచేసే బాలుడు కత్తితో దాడికి యత్నించాడు. భద్రాచలానికి చెందిన ఓ బాలిక దుమ్ముగూడెంలో ఇంటర్ చదువుతోంది. మండల కేంద్రంలోని ఓ మెకానిక్ దుకాణంలో బాలుడు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ రెండెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 10 రోజుల క్రితం బాలికను బలవంతంగా ఒప్పించి బాలుడు తాళికట్టాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు... ఇద్దరూ మైనర్లే కావటం వల్ల పెళ్లిని తిరస్కరించారు.
అమ్మాయిని భద్రాచలం తీసుకెళ్లి ఇంట్లోనే ఉంచటం వల్ల... బాలుడు కోపోద్రిక్తుడయ్యాడు. బాలిక మీద పగపెంచుకున్న బాలుడు నిన్న రాత్రి దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఉన్న బాలికపై దాడికి యత్నించగా... ఆమె అరుపులు విని స్థానికులు బాలున్ని నివారించారు. నిందుతున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భద్రాచలం పీఎస్‌లో బాలుడిపై బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గ్రేటర్ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి