ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా పడి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సుంగుగూడ గ్రామానికి చెందిన 20మంది బోథ్ మండలం కైలాశ్ టేకిడిలోని శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది.
క్షతగాత్రులకు బోథ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం టైరు ఊడి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'నాగార్జున సాగర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం'