ETV Bharat / jagte-raho

'నా భార్య మృతిపై అనుమానాలున్నాయి'.. భాజపా నేత కుమారుడి ఫిర్యాదు

తన భార్య మృతిపై అనుమానాలున్నాయంటూ భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎలా చనిపోయిందో చెప్పాలని.. కేసులో నిజాలను తనకు తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుహారికకు మద్యం, డ్రగ్స్‌ సేవించే అలవాటు లేదని స్పష్టం చేశారు. అలాంటిది ఎండీఎంఏ డ్రగ్స్‌ తీసుకుని మరణించి ఉంటుందని ప్రవీణ్‌ చెప్పడంపై అనుమానంగా ఉందని తెలిపారు.

kanna
kanna
author img

By

Published : Jul 25, 2020, 9:01 AM IST

తన భార్య సుహారిక మృతిపై అనేక అనుమానాలున్నాయంటూ భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును కొందరు తప్పుదోవ పట్టించారని, వారికి సుహారిక తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారని శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. మే 28న మిత్రుడు పవన్‌రెడ్డి ఇంట్లో సుహారిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.

"పవన్‌, ప్రవీణ్‌ (సుహారిక సోదరి భర్త), వివేక్‌, వివాస్‌, కావాలనే ఏదో దాస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు కుప్పకూలిన సుహారికను మధ్యాహ్నం 12.45 వరకు ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు. చనిపోయిన 2 నుంచి 3 గంటల తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెప్పారు. ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ కావడం వల్లనే సీపీఆర్‌ చేసినప్పుడు నోటి నుంచి రక్తం బయటకొచ్చిందని కూడా స్పష్టంచేశారు. అంటే అక్కడేదో జరిగి ఉంటుంది. గుండెపోటుతో మరణించినట్లు నాకు చెప్పారు. శవపరీక్ష నివేదికలోనేమో ఇతర కారణాలు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని నాపై ఒత్తిడి తెచ్చారు. సుహారిక మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పడం ఆశ్చర్యమనిపించింది. సుహారికకు మద్యం, డ్రగ్స్‌ సేవించే అలవాటు లేదు. అలాంటిది ఎండీఎంఏ డ్రగ్స్‌ తీసుకుని మరణించి ఉంటుందని ప్రవీణ్‌ చెప్పడంపై అనుమానంగా ఉంది. ఆరోజు ఏం జరిగిందని అడిగితే మా అత్త, మామ.. నీకవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ నలుగురు ఆరోజు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు"

- ఫిర్యాదులో ఫణీంద్ర పేర్కొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.