ETV Bharat / jagte-raho

చూసొస్తామని వెళ్లి.. రాకుండానే వెళ్లిపోయారు

అతివేగంతో ఓ ద్విచక్రవాహనదారుడు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టాడు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీ, కుమారుడు దుర్మరణం చెందారు. కుమార్తెను చూసొద్దామని వెళ్లి.. రాకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు.

accident at rangareddy
చూసొస్తామని వెళ్లి.. రాకుండానే వెళ్లిపోయారు
author img

By

Published : Dec 13, 2020, 7:50 AM IST

Updated : Dec 13, 2020, 8:32 AM IST

ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్న కుమార్తెను చూసొద్దామని వెళ్లిన ఓ తండ్రి, మనవరాలిని చూడాలని వెళ్లిన నాన్నమ్మ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో చోటుచేసుకొంది.

కొండకల్​ చెందిన శివయ్య రైల్వే ఉద్యోగి.. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివయ్య చిన్నకుమార్తె సాంఘిక సంక్షేమ గురుకులంలోని వసతిగృహంలో ఉంటూ ఇంటర్​ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమార్తెను చూస్తొద్దామని తల్లి బుచ్చమ్మతో కలిసి శివయ్య శనివారం ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగుప్రయాణంలో అతివేగం, అజాగ్రత్తగా మోకిలా సమీపంలోని ఓ విద్యుత్​ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Last Updated : Dec 13, 2020, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.