యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఫకీర్ గూడెంకు చెందిన కృష్ణయ్యతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వారివురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న బైక్.. బాలుడు మృతి