ETV Bharat / jagte-raho

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం... ఓ నిండు ప్రాణం బలి - నిజామాబాద్ లేటెస్ట్ న్యూస్

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ అనే వ్యక్తి విధుల కోసం వెళ్తుండగా ఓ లారీ ఢీకొంది. ద్విచక్రవాహనం మీద ఉన్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

bike-accident-in-nizamabad
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం... ఓ నిండు ప్రాణం బలి
author img

By

Published : Dec 2, 2020, 2:22 PM IST

లారీ డ్రైవర్ అజాగ్రత్తతో ఓ నిండు ప్రాణం బలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఓ కళాశాలలో ప్రిన్సిపల్​గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం విధుల కోసం బైపాస్ మీదుగా ద్విచక్రవాహనంపై కంటేశ్వర్ వెళ్తుండగా... లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వాపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డిచ్పల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో డీసీఎం బోల్తా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.