ETV Bharat / jagte-raho

'ఇన్​స్టా'​ పరిచయంతో ఇంటికి వచ్చారు.. దోచేశారు! - తెలంగాణ వార్తలు

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని స్నేహితుడి ఇంటికి వచ్చారు. అతనితో మాటలు కలిపారు. అనంతరం ఆ వ్యక్తిని బంధించి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. స్నేహం పేరుతో దోపిడీకి యత్నించిన ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

big robbery in the name of insta friendship in vanasthalipuram
'ఇన్​స్టా'​ పరిచయంతో ఇంటికి వచ్చారు.. దోచేశారు!
author img

By

Published : Dec 21, 2020, 8:11 PM IST

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆకలితో ఇంటికి వచ్చి దొంగతనానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ఇంటి యజమానిని బంధించి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన వడ్లమూడి నిఖిల్.. వనస్థలిపురంలో స్వచ్ఛంద సంస్థ నడిపే సతీష్ శిక్కాకు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమయ్యాడు. ఇదే అదునుగా భావించిన నిఖిల్ మరో ముగ్గురితో కలిసి ఈనెల 15న వనస్థలిపురంలోని సతీష్ శిక్కా ఇంటికి వచ్చి మాటలు కలిపాడు. అనంతరం కాళ్లు, చేతులు తాడుతో కట్టి ఇంట్లో ఉన్న కారు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు, నగదు, విదేశీ నగదు, పాస్​పోర్టులను దొంగిలించారు.

కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 26లక్షల 5వేల విలువైన రెండు కార్లు, ద్విచక్ర వాహనం, నగదు, సెల్ ఫోన్, రెండు నకిలీ తుపాకులు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే బళ్లారిలో నాలుగు కేసులు నమోదైనట్లు కమిషనర్​ మహేష్​ భగవత్​ తెలిపారు.

ఇదీ చదవండి: కువైట్​ టు గన్నవరం: మహిళ అదృశ్యం.. కారణమదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.