ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న పేలుడుపదార్ధాలు స్వాధీనం

కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దపర్వాతపూర్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

bhunagiri police find electric detonators in car at peddaparvathapure in yadadri bhuvanagiri district
పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
author img

By

Published : Jun 12, 2020, 6:38 PM IST

Updated : Jun 12, 2020, 6:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం పెద్దపర్వాతపూర్​ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి రూరల్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ప్రవీణ్, రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మరో నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలోఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కాటన్ పెట్టెల్లో నింపిన 3000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు.

బాల్​రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా తొగుట వద్ద మ్యాక్సయిన్ (పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాం) నిర్వహిస్తున్నారు. తన వద్ద భాస్కర్ రెడ్డిని డ్రైవర్​గా నియమించుకున్నాడు. బాల్​రెడ్డి అంకిరెడ్డిపల్లి వద్ద సాల్వో కంపెనీలో పేలుడు పదార్థాలను ఆన్లైన్​లో బుక్ చేశాడు. వాటిని తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ భాస్కర్ రెడ్డి డీసీఎం వ్యాన్​లో రెండు కాటన్ల ఎలక్ట్రిక్ డిటోనేటర్లను ఉంచి, ఆ సమాచారాన్ని ప్రవీణ్, రాజశేఖర్​కు తెలిపాడు. వారు వచ్చి రెండు కాటన్ల డిటోనేటర్లను కారులో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా భువనగిరి రూరల్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చూడండి: డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

Last Updated : Jun 12, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.