ETV Bharat / jagte-raho

భద్రాచలంలో తనిఖీలు.. 80 కేజీల గంజాయి పట్టివేత! - గంజాయి ముఠా అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మోతాదులో తరలిస్తున్న గంజాయిని భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం నిర్వహించే తనిఖీల్లో భాగంగా భద్రాచలంలో అంబేద్కర్​ సెంటర్​లో భారీగా గంజాయి తరలిస్తున్న కారును, అందులోని గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్​ చేసినట్లు భద్రాచలం సీఐ వినోద్​ రెడ్డి తెలిపారు.

Bhadrachalam Police Caught Illegal ganja smuggling
భద్రాచలంలో తనిఖీలు.. 80 కేజీల గంజాయి పట్టివేత!
author img

By

Published : Sep 1, 2020, 10:52 PM IST

Updated : Sep 1, 2020, 10:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్​ సెంటర్​లో భద్రాచలం పోలీసులు భారీ స్థాయిలో హైదరాబాద్​కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. రోజూవారి తనిఖీల్లో భాగంగా ఎస్సై మహేష్​ ఆధ్వర్యంలో అంబేద్కర్​ సెంటర్​లో నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా 80 కేజీల గంజాయిని తరలిస్తున్న కారును గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్నట్టు సీఐ వినోద్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​కు చెందిన సతీష్​, మహారాష్ట్రకు చెందిన దీపక్​ అనే గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. భద్రాచలంలో ప్రధాన రహదారులలో ప్రత్యేక సోదాలు చేస్తున్నామని సీఐ తెలిపారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించే వారు ఏదో ఒకనాడు కటకటాల్లోకి వెళ్లాల్సిందే అని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి : ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!

Last Updated : Sep 1, 2020, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.