ETV Bharat / jagte-raho

ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం - ఆంధ్రప్రదేశ్​ తాజా సమాచారం

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో ఆటో నడుపుతున్న డ్రైవర్​కు అనుకోకుండా ఫిట్స్ వచ్చింది. పట్టణంలో రహమత్​నగర్​లోని ఓ హోటల్​లోకి వాహనం దూసుకువెళ్లింది. చిన్న చిన్న సామగ్రితో పాటు ఆటో ధ్వంసం కాగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

auto-went-into-hotel-in-anantapuram-rehmat-nagar-as-driver-got-suddent-fits
ఊహించని ప్రమాదం...తప్పిన అపాయం
author img

By

Published : Nov 4, 2020, 4:59 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో రహమత్​నగర్​లో రోడ్డు పక్కనున్న ఓ హోటల్​లోకి ఆటో దూసుకెళ్లింది. ప్రాణనష్టం తప్పినా.. వాహనం ముందు భాగంతో పాటు చిన్న, చిన్న సామగ్రి ధ్వంసమైంది. డ్రైవర్​కు ఫిట్స్ రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

అతడిని ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య సమయాల్లో వాహనాలు నడిపి.. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. వాహన చోదకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించండి: బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.