మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో ఓ ఇంట్లో నిర్వహిస్తోన్న పేకాట స్థావరంపై మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు శ్రీకాంత్తో పాటు నగరానికి చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.51 వేల నగదు, 10 చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు వివరించారు.
ఇదీచూడండి.. దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క