మాస్క్ లేని వారికి మద్యం ఇవ్వమని చెప్పిన మద్యం షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరోనా రూల్స్ పాటించాలని అత్తాపూర్ మంజు వైన్స్ యాజమాన్యం తెలిపింది.
మాస్క్ లేదని మద్యం ఇవ్వని వైన్ షాప్ యజమానిపై సదాశివ అనే వ్యక్తి, అతని అనుచరులు దాడికి దిగారు. ఈఘటనలో షాపు నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం యువకులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.