ములుగు జిల్లాలో మావోయిస్టు మిలీషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. వెంబడించి పట్టుకున్న పోలీసులు అతన్ని విచారించారు. సోడి ఊర అలియాస్ ఊరడుగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చిన్న ఉట్లపల్లికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ మడకం ఐతా ద్వారా పార్టీకి పరిచయమయినట్లు గుర్తించారు. 2012లో మిలీషియా సభ్యుడిగా చేరిన నుంచి మావోయిస్టులకు బియ్యం, కూరగాయలతో పాటు పార్టీకి అన్ని రకాలుగా సహకరిస్తున్నాడని విచారణలో తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.