ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వీబీ రమణమూర్తి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహలోని ఆయన నివాసంలో అర్థరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఐదో అంతస్తు నుంచి దూకి బలవర్మణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య ఆరోపించారు.
ప్రస్తుతం గుంటూరులోని అరణ్య భవన్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా రమణమూర్తి విధులు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు తప్ప చనిపోవడానికి ఎలాంటి పెద్ద కారణాలు లేవని అతని మిత్రుడు రాజు తెలిపారు. గత రెండు నెలలుగా అయన సెలవులో ఉన్నారని ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. రమణమూర్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: అయ్యో పాపం.. ఎవరో పాపను వదిలేశారు..