ETV Bharat / jagte-raho

కాసేపట్లో చంచల్​గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ మహిళా జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు. ఆమెకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ap former minister akhilapriya released from chanchalguda prison in hyderabad
కాసేపట్లో విడుదల కానున్న అఖిలప్రియ
author img

By

Published : Jan 23, 2021, 12:14 PM IST

మాజీ మంత్రి అఖిలప్రియ మరికాసేపట్లో బెయిల్‌పై విడుదలై బయటకు రానున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిలప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి చంచల్​గూడ మహిళా జైల్లో అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

బోయిన్​పల్లిలో ప్రవీణ్ సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆమెను బోయిన్​పల్లి పోలీసులు ఆరో తేదీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ బెయిల్ పై బయటకు రానుందని తెలుసుకున్న ఆమె అభిమానులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. ఆళ్లగడ్డ కు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు జైలు ముందు వేచి చూస్తున్నారు.

ఇదీ చదవండి: నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.