ETV Bharat / jagte-raho

సమత కుటుంబంలో మరో విషాదం

కాలం ఆ కుటుంబాన్ని కాటేసింది. విధి ఆ కుటుంబాన్ని వంచించింది. ఏడాది క్రితం ఆమె కుమార్తె కామాంధుల చేతిలో బలైపోయింది. ఇప్పుడు కొడుకు ఆనారోగ్యంతో మరణించడంతో ఆ తల్లి మౌనంగా విలపిస్తోంది. ఈ తల రాతను తన నుదుటిపై ఎందుకు రాశావంటూ దేవున్ని ప్రశ్నిస్తోంది.

Another tragedy in the Samata's family
సమత కుటుంబంలో మరో విషాదం
author img

By

Published : Dec 26, 2020, 8:06 AM IST

ఏడాది క్రితం ఆమె కుమార్తె(సమత) కామాంధుల చేతిలో నలిగిపోయింది. ప్రస్తుతం ఆమె కుమారుడు బతుకుదెరువు కోసం వెళ్లి అనారోగ్యంతో మృతి చెందాడు. కళ్ల ముందే తన బిడ్డలు విగత జీవులవుతుంటే ఆ తల్లి మౌనంగా రోదిస్తోంది. విధి ఆడిన నాటకంలో విషాదాన్ని నింపిన ఈ ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లెలో జరిగింది.

గ్రామానికి చెందిన మోతె శ్రీనివాస్‌(30) మరో ఏడుగురితో కలిసి 25 రోజుల క్రితం ఝార్ఖండ్‌లోని ఛాయ్‌దసా జిల్లాకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ చిన్న చిన్న పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. శ్రీనివాస్‌కు తల్లి ఎల్లవ్వ, భార్య అనూష, కుమార్తె రాఘవి, కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కనీసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాలేక అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. 2019 అక్టోబరు 24న కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎల్లాపటార్‌లో చిరువ్యాపారం చేసుకునేందుకు వెళ్లిన సమతను నలుగురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకొని తల్లి ఎల్లవ్వ విలవిలలాడుతోంది.

ఇదీ చదవండి: మొదలైన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.