ETV Bharat / jagte-raho

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే! - కంజర్ భట్ గ్యాంగ్ అరెస్టు న్యూస్

కంటైనర్లుకు కన్నం వేసి.. ఖరీదైన ఫోన్లను కొట్టేసే.. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్​కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో చిత్తూరు జిల్లాలో దోపిడీ చేసిన 7 కోట్ల విలువైన సొత్తు కూడా ఉంది.

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

author img

By

Published : Sep 30, 2020, 7:49 AM IST

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

సెల్ ఫోన్లు రవాణా చేస్తున్న కంటెనర్లను అడ్డగించడం.. ఆపై అపహరించడం.. అవసరమైతే.. కదులుతున్న కంటైనర్లలో నుంచే.. సెల్​ఫోన్లను కొట్టేయడం.. ఇదీ ఈ గ్యాంగ్ స్పెషాలిటీ..! కిందటి ఆగస్టు 15న తేదీన ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి వద్ద తమిళనాడు నుంచి ముంబాయి వెళ్తున్న షియోమీ కంపెనీ సెల్ ఫోన్ కంటైనర్​ను దారి మళ్లించి.. అందులో 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా శ్రీ సిటీ షియోమీ కంపెనీ నుంచి కోల్​కతాకు వెళుతున్న కంటైనర్ నుంచి.. 80 లక్షల విలువైన సెల్ ఫోన్లు గుంటూరు వద్ద కొట్టేశారు. ఈసారైతే.. డ్రైవర్​కు ఏమాత్రం అనుమానం రాకుండా.. కదులుతున్నప్పుడే.. జాతీయ రహదారిపై చోరీ చేశారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి దోపిడీలకు పాల్పడేది మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని.. కంజర్ భట్ ముఠానే..! మహరాష్ట్రకు చెందిన సాప్ట్​వేర్ ఇంజినీర్ రామ్ గాఢే... కంజర్ గ్యాంగ్​తో కలిసి ఈ స్కెచ్ వేశాడు. దొంగతనం జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా పోలీసులు నెల రోజులుగా దేవాస్ లోనే మకాం వేసి.. అక్కడి పోలీసులతో కలిసి.. ఈ ముఠా ఆట కట్టించారు. ప్రధాన నిందితుడు రామ్ గాఢేతో పాటు.. అంకిత్ ఝాఝా, రోహిత్ ఝాలాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 15 కోట్ల విలువచేసే.. 10 వేలకు పైగా మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. 2 ట్రక్కులు, కారు, స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుతో పాటు.. పుణె, ఇండోర్ ప్రాంతాల్లో అపహరించిన చరవాణిలు కూడా ఇందులో ఉన్నాయి. దేవాస్ పోలీసు సూపరింటెండెంట్ శివ దయాల్ సింగ్ విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పనిచేస్తున్న రామ్ గాఢేనే దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ల చోరీకి పథకం వేశాడు. దొంగిలించిన ఫోన్లకు ఐఏంఈఐ నెంబర్లను మార్చి.. ఆ తర్వాత బ్లాక్ మార్కెట్​లో విక్రయించేవారు. ఒకేసారి 7 కోట్ల విలువైన సొత్తు పోవడంతో చిత్తూరు జిల్లా పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్​స్పెక్టర్ సాదిఖ్ అలీ నేతృత్వంలోని ఈ బృందం నెల రోజుల పాటు దేవాస్ లోనే మకాం వేసి.. చోరీ సొత్తును రికవరీ చేసింది.

చరవాణుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను దేవాస్ పోలీసులు పట్టుకున్నారు. వీరు రాత్రివేళ రహదారులపై సంచరిస్తూ... వాహనాల డ్రైవర్లను బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సహకారంతో నిందితులను పట్టకున్నాం. వీరి నుంచి రూ.15కోట్లు విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. రామ్​గడే, అంకిత్, రోహిత్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. దేవాస్​లోని టోక్​పూర్ పోలీస్ స్టేషన్​లో నమోదైన ఎఫ్​ఐఆర్ ప్రకారం... ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేసుకునే రామ్​గాడే కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఈ కేసును ఛేదించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.

- శివదయాల్ సింగ్, ఎస్పీ, దేవాస్

ఆగస్టు 15, 25న ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో చరవాణుల దొంగతనాల ఘటనలు జరిగాయి. వీటిపై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టగా... దేవాస్​కు చెందిన కంజర్ ముఠా ఈ దొంగతనాలకు పాల్పడిందని గుర్తించాం. ఈ ఘటనపై దేవాస్ పోలీసులకు సమాచారం అందించాం. వెంటనే అప్రమత్తమైన దేవాస్ ఎస్పీ... ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో 15 రోజులు గాలించి కంజర్ ముఠాను గుర్తించాం. ఈ రోజు ఉదయం ఇద్దరిని అరెస్టు చేశాం. వారి నుంచి 7 కోట్ల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం.

- సాదిఖ్ అలీ, ఇన్స్​పెక్టర్, చిత్తూరు జిల్లా

ఇదీ చదవండి: కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.