సమాజంలో గుర్తింపు.... నిత్యం బుల్లితెరపై ప్రేక్షకులను పలకరించడం...మంచి హోదా...సౌకర్యవంతమైన జీవితం... ఇవన్నీ ఉన్నా యాంకర్లు, నటీమణులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు... మొన్న నిరోషా నిన్న రాధిక, తేజస్విని నేడు ఝాన్సీ ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందరిలో తలెత్తే ప్రశ్న ఇదే...
ఝాన్సీ పవిపత్రబంధం సీరియల్లో నటించింది. ఎందుకో ఏమో ఆమె ఉన్నట్టుండి మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక సమాచారం.
న్యూస్ యాంకర్ రాధిక ముసాపేటలోని తన అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కొడుకుతో పాటు తల్లి వద్దే ఉంటోంది. విధులు ముగుంచుకుని ఇంటికి వచ్చిన రాధిక పైఅంతస్థు నుంచి దూకి తనువు చాలించింది. తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసింది.
అత్తంటివారి వేధింపులు తాళలేక వ్యాఖ్యాత తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పవన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
యాంకర్ నిరోషా కాబోయే భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు ఆరోగ్య బాగాలేదని బతకడం వృధా అంటూ బలన్మరణానికి ఒడిగట్టింది.
ప్రేమ వ్యవహారం, కుటుంబ పరిస్థితులు, కారణమేదైనా సరే.. ఆత్మహత్యలు సరికాదంటున్నారు మానసిక నిపుణులు. కుటుంబసభ్యులతో అనుబంధం, సమస్యలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెంచుకుంటే.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలరని సూచిస్తున్నారు.
యాంకర్లకు ఏమైంది..?
తమ మాటలు, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యాఖ్యాతలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిది ప్రేమ వ్యవహారం కాగా మరొకరిది కుటుంబ పరిస్థితులు ఇంకొక్కరిది ఆరోగ్య సమస్య....
సమాజంలో గుర్తింపు.... నిత్యం బుల్లితెరపై ప్రేక్షకులను పలకరించడం...మంచి హోదా...సౌకర్యవంతమైన జీవితం... ఇవన్నీ ఉన్నా యాంకర్లు, నటీమణులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు... మొన్న నిరోషా నిన్న రాధిక, తేజస్విని నేడు ఝాన్సీ ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందరిలో తలెత్తే ప్రశ్న ఇదే...
ఝాన్సీ పవిపత్రబంధం సీరియల్లో నటించింది. ఎందుకో ఏమో ఆమె ఉన్నట్టుండి మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక సమాచారం.
న్యూస్ యాంకర్ రాధిక ముసాపేటలోని తన అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కొడుకుతో పాటు తల్లి వద్దే ఉంటోంది. విధులు ముగుంచుకుని ఇంటికి వచ్చిన రాధిక పైఅంతస్థు నుంచి దూకి తనువు చాలించింది. తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసింది.
అత్తంటివారి వేధింపులు తాళలేక వ్యాఖ్యాత తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పవన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
యాంకర్ నిరోషా కాబోయే భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు ఆరోగ్య బాగాలేదని బతకడం వృధా అంటూ బలన్మరణానికి ఒడిగట్టింది.
ప్రేమ వ్యవహారం, కుటుంబ పరిస్థితులు, కారణమేదైనా సరే.. ఆత్మహత్యలు సరికాదంటున్నారు మానసిక నిపుణులు. కుటుంబసభ్యులతో అనుబంధం, సమస్యలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెంచుకుంటే.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలరని సూచిస్తున్నారు.
Body:అలంపూర్
Conclusion: