అమీర్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు మృతదేహన్ని వెలికితీశారు.
బిగ్‌బజార్‌కు ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లోని నీటిలో తేలియాడుతూ కనిపించింది. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.