నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం టెంబుర్ని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది నిమ్మల గంగవ్వ అనే వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.
టెంబుర్ని గ్రామానికి చెందిన గంగవ్వ.. కుటుంబ కలహాల నేపథ్యంలో 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుమారుడు నిమ్మల శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం అర్లీ(కె) సుద్ధవాగులో ఓ వృద్ధురాలు శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సాయంతో శవాన్ని బయటకు తీశారు. మృతురాలు నిమ్మల గంగవ్వగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. అమానుషం... భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య