మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీలోని రసూల్ పల్లిలో ఇల్లు కూలి దుర్గం పోశయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
గోడలు పూర్తిగా తడిసిపోయాయి...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు పూర్తిగా తడిసిపోయాయి. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఇంటి గోడల పై కప్పు మీద పడి పోశయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం