తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టినట్లు అన్న చందంగా... ఓ వ్యక్తి ఉపాధి ఇచ్చిన సంస్థలోనే కన్నమేశాడు. పనిచేస్తున్న సంస్థలోనే రూ. పదిలక్షల విలువైన సొత్తును కాజేసిన సాయిచరణ్‌ను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు.
బేగంపేటలోని మహేంద్ర హాలీడేస్ కంపెనీలో మూడేళ్ల క్రితం స్టోర్‌కీపర్‌గా సాయి చరణ్ చేరాడు. అప్పటి నుంచి సంస్థలో ఎవ్వరికీ అనుమానం రాకుండా 30 ల్యాప్‌టాప్‌లు, 30 డెస్క్‌టాప్‌లు తస్కరించాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎలా దొరికాడంటే..
ఈ 18 నుంచి కార్యాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయమై చెన్నైలో మేనేజర్ నుంచి సాయిచరణ్‌కు ఫోన్ వచ్చింది. అనంతరం సర్వీసులు ప్రారంభించారు. అయితే 17వ తేదీ నుంచి ఇంటర్నెట్ పనిచేయడం లేదని తెలిసింది. ఈ విషయమై సెక్యురిటీ సిబ్బందిని ప్రశ్నించగా.. సాయిచరణ్ రాత్రి వరకు కార్యాలయంలోనే ఉన్నట్లు తెలిపారు. కానీ... అంతకంటే ఒకరోజు ముందే సాయిచరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని సెలవు తీసుకున్నాడు. సాయిచరణ్ వ్యవహారంపై అనుమానమొచ్చిన సంస్థ యాజమాన్యం ఆడిట్ చేయించగా... డెస్క్‌టాప్‌లు, లాప్‌టాప్‌లు చోరీ అయినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన వస్తువుల విలువ సుమారు రూ. 10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: తల్లీకొడుకుల అదృశ్యం... తండ్రి మందలింపే కారణమా?