కారులో నిషేధిత అంబర్ ప్యాకెట్లు, గంజాయి తరలిస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ మాధవి వెల్లడించారు. కారులో అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో సిర్సపల్లి అడ్డదారి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. సమూరు రూ. 2 లక్షల విలువ చేసే 10 సంచుల అంబర్, 750 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
నిందితులు హుజూరాబాద్‌కు చెందిన కాపర్తి అనిల్‌కుమార్, గందె సాయి, కొలిపాక శ్రీనివాస్, గోదావరిఖనికి చెందిన కొలనుపాక శ్రీధర్, గుడికందులు అజేందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.