సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని మల్లికార్జున వైన్స్లో మంగళవారం రాత్రి కొందరు దొంగతనానికి వెళ్లారు. పోలీసులు.. మద్యం చోరీచేస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు.
పట్టుబడిన 8 మంది నిందితుల్లో ఇద్దరు ఆ మద్యం దుకాణం యజమానులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వైన్స్ వెనక వైపున గల కిటికీలను పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు వివరించారు.