ETV Bharat / jagte-raho

రూ.40 లక్షల లంచం సొమ్ముతో స్థలం కొనుగోలు!

చివరిరోజు కస్టడీలో అదనపు కలెక్టర్​ నగేశ్​ నుంచి అనిశా అధికారులు కీలక సమాచారం సేకరించారు. తొలిమూడు రోజులు పెద్దగా సహకరించని నగేశ్‌ నుంచి ఎట్టకేలకు రూ.40 లక్షల లంచం సొమ్ము గురించి సమాచారం రాబట్టింది. బాధితుడి నుంచి రెండు విడతలుగా తీసుకున్న సొమ్ముతో హైదరాబాద్‌ శివార్లలో ఖాళీస్థలాల్ని కొన్నట్లు అంగీకరించినట్లు తెలిసింది.

additional collector nagesh buy a place in hyderabad with bribe money

author img

By

Published : Sep 25, 2020, 7:27 AM IST

భూమి నిరభ్యంతర పత్రం జారీకి రూ.1.12 కోట్ల లంచం డిమాండ్‌ చేసి దొరికిపోయిన నాటి మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ నుంచి చివరి రోజు కస్టడీలో అనిశా కీలక సమాచారం సేకరించింది. కస్టడీలో తొలిమూడు రోజులు పెద్దగా సహకరించని నగేశ్‌ నుంచి ఎట్టకేలకు రూ.40 లక్షల లంచం సొమ్ము గురించి సమాచారం రాబట్టింది. బాధితుడి నుంచి రెండు విడతలుగా తీసుకున్న సొమ్ముతో హైదరాబాద్‌ శివార్లలో ఖాళీస్థలాల్ని కొన్నట్లు అంగీకరించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన కొన్ని పత్రాల్ని అనిశా గుర్తించింది.

ఈ అక్రమ వ్యవహారంలో నగేశ్‌.. ఆయన బినామీ జీవన్‌గౌడ్‌ల మధ్య మొబైల్‌లో నడిచిన సంప్రదింపులకు సంబంధించిన సాంకేతిక ఆధారాల్ని అనిశా సంపాదించింది. జీవన్‌గౌడ్‌ పేరిట భూమి ఒప్పందం రాయిస్తున్నానని.. తర్వాత తన పేరిట మార్పించుకుంటానని నగేశ్‌ జరిపిన వాట్సప్‌ సంభాషణల్ని గుర్తించారు. అందుకు బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌కార్డు పంపించాలని నగేశ్‌ అడగడంతో జీవన్‌గౌడ్‌ వాట్సప్‌లో పంపించినట్లు ఆధారాలు సేకరించారు.

నా భర్త స్థిరాస్తి డబ్బులు కావొచ్చు

ఇదే కేసులో నిందితురాలైన ఆర్డీవో(సస్పెన్షన్‌) అరుణ ఇంట్లో జరిపిన సోదాల్లో లభించిన రూ.28 లక్షల గురించి కస్టడీలో ఆమెను విచారించారు. ఆ డబ్బులు తన భర్తకు సంబంధించినవి అయి ఉంటాయని ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది. భువనగిరి, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో తన భర్త భూములు కొనుగోలు చేసి స్థిరాస్తి వ్యాపారం చేశారని, ఆ లావాదేవీల డబ్బులు అయి ఉంటాయని అరుణ చెప్పినట్లు సమాచారం. ఈక్రమంలో ఆమె భర్తను విచారించేందుకు అనిశా సిద్ధమవుతోంది. మరో నిందితుడు వసీం నుంచి అనిశా కీలక సమాచారం రాబట్టింది. కలెక్టర్‌ కార్యాలయంలో నగేశ్‌తో వసీం సన్నిహితంగా మెలిగేవాడని గుర్తించిన అనిశా కస్టడీలో అతడిపై దృష్టి సారించింది.

ఇదీ చూడండి: ముగిసిన కస్టడీ... 49 లక్షల లంచంపై నోరుమెదపని నగేశ్​..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.