ETV Bharat / jagte-raho

'భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు' - కూకట్లపల్లిలో వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఏపీలోని ప్రకాశం జిల్లా కూకట్లపల్లి గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును అద్దంకి పోలీసులు ఛేదించారు. భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు తెలిపారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/16-October-2020/9200372_1096_9200372_1602855954562.png
భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు: దర్శి డీఎస్పీ
author img

By

Published : Oct 16, 2020, 10:03 PM IST

ఈ నెల 10న ఏపీలోని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు వెల్లడించారు. కూకట్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మరీదాసుకి రాణితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే రాణి బిడ్డకు జన్మనిచ్చిందని డీఎస్పీ తెలిపారు. భార్యభర్తల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో మరీదాసు.. భార్యతో గొడవ పడ్డాడని.. ఈ క్రమంలో ఆమె గొంతునులిమి చంపినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వెల్లడించారు.

నిందితునికి హైదరాబాద్​కు చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై జరిగిన గొడవ హత్యకు దారి తీసిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన అద్దంకి సీఐ ఆంజనేయ రెడ్డి, ఎస్సై శివ నాంచారయ్య, పోలీస్ సిబ్బందిని ఎస్పీ తరఫున ఆయన అభినందించారు.

ఇదీ చూడండి: 3 రోజులు దాటినా నీటిలోనే పలు కాలనీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.