ETV Bharat / jagte-raho

బోయిన్​పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ - బోయిన్​పల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్​లో ఈ నెల 21న జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు దొంగలించిన వస్తువులతో పాటు కారు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

బోయిన్​పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
author img

By

Published : Oct 28, 2019, 7:42 PM IST

ఈ నెల 21న హైదరాబాద్ బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని మధురానగర్​లో భారీ చోరీ జరిగింది. పోలీసులు కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సరళ కోడలే చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోడలు, ఆమె సోదరుడితో కలిసి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2కిలోల బంగారం, ఆరున్నర కిలోల వెండి సహా మొత్తం 80 లక్షల రూపాయల విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే చోరీకి కారణమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.

బోయిన్​పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

ఇదీ చదవండిః సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ

TG_HYD_27_28_CHORI_CASE_AB_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో ఈ నెల 21వ తేదీన జరిగిన భారీ చోరిని పోలీసులు ఛేదించారు. నిందితులు చోరి చేసిన 2 కిలోల బంగారు, ఆరున్నర కిలోల వెండితో పాటు కారు, నాలుగు చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరికి పాల్పడిన 4గురు నిందితులను అరెస్ట్ చేశారు. కోడలే చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కామారెడ్డికి చెందిన సుప్రియకు.... బోయిన్ పల్లికి చెందిన ధీరజ్ తో 4నెలల క్రితం వివాహమైంది. ధీరజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా ఆయన తల్లి సరళ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. 20వ తేదీ సుప్రియ తన తల్లిగారింటికి వెళ్లింది. 21వ తేదీ మధ్యాహ్నం సరళ ఇంటికి తాళం వేసి ఫైనాన్స్ దగ్గరికి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్న విషయాన్ని గమనించింది. పడక గది బీరువాలో ఉన్న ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల సాయంతో ఆధారాలు సేకరించారు. ధీరజ్ భార్య సుప్రీయ తన అన్న, తల్లిదండ్రుల సాయంతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భార్యభర్తల మధ్య వైవాహిక జీవితం విషయంలో తలెత్తిన గొడవలే చోరీకి దారి తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీకి పాల్పడి భర్త, అత్తలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్దేశంతోనే సుప్రియ అత్త ఇంట్లో దొంగతనం చేసిందని పోలీసులు గుర్తించారు........BYTE అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.